Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 May 2024 21:01 IST

1. పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్‌ రెడ్డి

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మెదక్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలవబోతోందంటే దానికి కార్యకర్తలే కారణమన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు

జగన్‌ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పట్టాదారు పాసు పుస్తకంపై జగన్‌ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా?’’ అని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన

బ్యాలెట్‌ పేపరులో మార్పులపై చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు 46 మంది నామినేషన్‌ దాఖలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. 8న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..

ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠ ధర వద్ద రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘తలవంచడం అనేది మా డీఎన్‌ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్‌

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) అరెస్టు ఊహించని పరిణామమని ఆయన భార్య కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు. ఇది జేఎంఎంతోపాటు తమ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసిందన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె (Kalpana Soren).. తలవంచడమనేది గిరిజనుల డీఎన్‌ఏలోనే లేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. లైంగిక వేధింపుల ఎఫెక్ట్‌.. బ్రిజ్‌భూషణ్‌ స్థానంలో కుమారుడికి టికెట్‌

నుకున్నట్లే జరిగింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan)ను ఈ ఎన్నికల్లో (Lok Sabha Elections) భారతీయ జనతా పార్టీ (BJP) పక్కనబెట్టింది. అయితే  ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్‌ కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం నుంచి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లేఖ

మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గత ఆరు నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కిమ్‌ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!

ఉత్తర కొరియాతోపాటు ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un)కు సంబంధించి సంచలన విషయాలు అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను ‘సంతోష పెట్టడానికి’ ఏటా 25 మంది యువతుల బృందం పనిచేస్తుందని తెలిసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్‌.. విదేశాంగ శాఖ వెల్లడి

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం అంశం కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ప్రజ్వల్‌ రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జర్మనీలో ఉంటున్నట్లు తేలింది. దౌత్యపరమైన (డిప్లొమాటిక్‌) పాస్‌పోర్టుతో దేశం దాటి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని