logo

భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా

విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు.

Published : 29 Apr 2024 04:00 IST

మాట్లాడుతున్న పీతల మూర్తియాదవ్‌, చిత్రంలో బైరెడ్డి పోతనరెడ్డి తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. ఆదివారం ఉదయం తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జనసేన కార్పొరేటరు పీతల మూర్తియాదవ్‌ మాట్లాడుతూ రోజుకు 30నిమిషాలకు మించి మంచినీటిని సరఫరా చేయలేకపోతున్న జీవీఎంసీ భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా శుద్ధి చేసిన నీరు ఇస్తోందని దుయ్యబట్టారు. కైలాసపురం వద్ద నిర్మాణ దశలో ఉన్న ఇనార్బిటాల్‌ మాల్‌కు రోజుకు 2లక్షల లీటర్ల నీటిని ఇవ్వడం దారుణమని, దీని వెనుక వైకాపా పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఫలితంగా నగరంలో లక్షలాది మందికి తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. తెదేపా నేత బైరెడ్డి పోతనరెడ్డి మాట్లాడుతూ యంత్రాంగం ముందుచూపు లేకుండా వ్యవహరించడం వల్లే నీటి ఎద్దడి తలెత్తిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంవీ ప్రణవ్‌గోపాల్‌, రాజు, పోతు వెంకట దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని