logo

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 04:12 IST

విశాఖ ఎం.పి. అభ్యర్థి సత్యారెడ్డిని పరిచయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: 32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. ఆదివారం అక్కయ్యపాలెం మహారాణిపార్లర్‌ కూడలిలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యారెడ్డితో పాటు వివిధ నియోజకవర్గాల శాసనసభ అభ్యర్థులు జగ్గునాయుడు, వాసుపల్లి సంతోష్‌, రామారావు, అత్తిలి విమల, డాక్టర్‌ తిరుపతిరావు, అనకాపల్లి ఎం.పి. అభ్యర్థి వేగి వెంకటేష్‌, సి.పి.ఎం., సి.పి.ఐ. నేతలు సిహెచ్‌.నర్శింగరావు, జె.వి.సత్యనారాయణమూర్తి, స్థానిక ఇండియా కూటమి నేతలు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉత్తరం నియోజకవర్గంలో ఇద్దరు రాజులు శాసనసభకు పోటీ పడుతున్నారని, వారిద్దరూ ఒక్కటేనని నేతలు విమర్శించారు. దక్షిణంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌ రెండుసార్లు తెదేపాలో గెలిచి విశ్వాసం లేకుండా వైకాపాలో చేరారన్నారు.  వై.ఎస్‌.షర్మిల మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు పేరు చెప్పి ప్రజల్ని మోసం చేశాడన్నారు. ఒక్కటంటే ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. విశాఖను కబ్జా చేసి అమ్మేశాడని విమర్శించారు.ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని