logo

రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా కూటమిని గెలిపించాలి

ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు.

Published : 01 May 2024 03:12 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు. అనకాపల్లిలోని లక్ష్మీదేవిపేటలో ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేశ్‌ తరఫున మంగళవారం ఆమె రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న సీఎం రమేశ్‌ను అనకాపల్లి ఎంపీగా ఎన్నుకోవాలని ఓటర్లును కోరారు. ఆయన గెలిస్తే ఎంపీతో పాటుగా కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వస్తుందన్నారు. దీనివల్ల అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంతో పాటు అనకాపల్లి పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. యువతకు ఉపాధితో పాటుగా అభివృద్ధి కోసం సీఎం రమేశ్‌ని ఎంపీగా, కొణతాల రామకృష్ణను అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేశ్‌ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఎంటో చేసి చూపిస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రచార సమయంలో తమకు అయోద్య రామాలయం చూపించాలని మహిళలు అడుగుతున్నారని వారి కోరిక నెరవేరుస్తానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్‌, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని