logo

పేదల స్థలాలు కబ్జా

కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్‌తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

Published : 01 May 2024 03:15 IST

వైకాపా నేతపై ఫిర్యాదు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్‌తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి   బాధితుల కథనం ప్రకారం.. అచ్యుతాపురం మండలం చోడపల్లిలో సెజ్‌ కంపెనీలో పనిచేసే దళిత యువకుడు బత్తిన అప్పారావు ఉద్యోగం ద్వారా పొదుపు చేసిన డబ్బులతో అయిదు సెంట్లు ఇంటి స్థలాన్ని ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇంటిని నిర్మించుకుందామనే సమయంలో స్థలం ఆక్రమణకు గురికావడంతో ఆందోళన చెందారు. స్థలంలో అడుగు పెడితే శ్మశానానికి దారి చూపిస్తానని బెదిరిస్తున్నారని ఆ యువకుడు బోరుమంటున్నాడు. ఇతనితో పాటు మజ్జి రామకృష్ణకు 4 సెంట్లు, గెద్దాడ తాతబాబుకు చెందిన 11 సెంట్ల స్థలాలను కూడా ఆ నేత కబ్జా చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ఈ ముగ్గురూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విలువైన భూములకు తప్పుడు పత్రాలను సృష్టించి అమాయకులైన పేదలకు చెందిన భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజును వివరణ కోరగా దీనిపై ఎటువంటి ఫిర్యాదులు అందలేని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని