logo

ఈ కార్డులుంటే ఓటెయ్యొచ్చు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13న జరిగే పోలింగ్‌లో 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని డీఆర్వో బి.దయానిధి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 05 May 2024 03:52 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13న జరిగే పోలింగ్‌లో 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని డీఆర్వో బి.దయానిధి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌, ఎన్‌ఆర్‌జీఎస్‌ జాబ్‌కార్డు, కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, ఆర్‌బీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, బ్యాంకు, తపాలా శాఖ జారీ చేసిన పాస్‌ పుస్తకం, పాస్‌పోర్టు, ఫొటోగ్రాఫ్‌ ఉన్న పింఛను డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంఎల్‌సీలకు జారీ చేసిన ప్రభుత్వ గుర్తింపు కార్డు, ప్రత్యేక వైకల్యాన్ని గుర్తించే కార్డు ఇలా వీటిలో ఏ ఒక్కటైనా ఉపయోగించి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని