logo
Published : 29/11/2021 05:21 IST

ఈ మాస్కులు కొనసాగించాల్సిందేనా?

ఆందోళనకరంగా వాయుకాలుష్యం

మయూరి కూడలి, రింగురోడ్డు, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రాన్ని కాలుష్యభూతం వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలో 122 నగరాలను ఎంపిక చేయగా అందులో విజయనగరం కూడా ఉందని ఇటీవల కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడి కాలుష్య కారకాల నివారణపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆందోళనకరంగా పరిస్థితి ఉందని, దీని స్థాయి పెరిగితే ఇబ్బందులు తప్పవని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.

నగరంలో దాదాపు 1.7 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. రోజూ 30 వేల మంది వరకు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. వీరంతా ఎక్కువగా వాహనాలపై ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో అన్నిరకాల వాహనాలు కలిసి 40 వేల వరకు ఉన్నాయి. పది కిలోమీటర్ల పరిధిలో 10 వరకు ప్రధాన పరిశ్రమలున్నాయి.

పరిస్థితి ఇదీ..: జాతీయ కాలుష్య నివారణ సంస్థ ప్రకారం పీఎం-10(పార్టిక్యులేట్‌ మేటర్‌) విలువ 60 ఎంఎఫ్‌సీఎం(మైక్రోగ్రామ్స్‌ ఫర్‌ క్యూబిక్‌ మీటర్‌) దాటకూడదు. కానీ నగరంలో ప్రస్తుతం సరాసరి 63.5 ఎంఎఫ్‌సీఎం ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితికి ధూళి కణాలు పెరగడం, కాలం చెల్లిన వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ సమస్య, పరిశ్రమల వ్యర్థాలు, చెత్త నిర్వహణ లోపం తదితరాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. నగరంలో ఏటా నాలుగు వేల వరకు నిర్మాణాలు జరుగుతుండడం, అదే స్థాయిలో కూల్చివేతలు సాగుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం వాహనాల సంఖ్య 38 శాతం పెరగడం కూడా వాయుకాలుష్య తీవ్రతకు ఓ కారణంగా చెబుతున్నారు.

మూడుచోట్ల గ్రోత్‌ సెంటర్లు..: జాతీయ కాలుష్య నివారణ పరిశీలన కేంద్రాలుగా కార్పొరేషన్‌ పరిధిలో మూడు చోట్ల గ్రోత్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వి.టి.అగ్రహారం ఏపీఐఐసీ, కస్పా పాఠశాల, పురపాలక కార్యాలయం మేడపై సంబంధిత పరికరాలను అమర్చారు. ఆయా గ్రోత్‌ సెంటర్ల ద్వారా గాలిలో కాలుష్య తీవ్రతను లెక్క కడతారు. ప్రస్తుతం జిల్లాలో నాన్‌ డిజిటల్‌ విధానం ద్వారా కాలుష్యాన్ని పరిశీలిస్తున్నారు.

నివారణకు మార్గాలివీ..: ● ఎక్కువగా మొక్కలు పెంచడం ● విద్యుత్తు వాహనాలు, సైకిళ్లను ఉపయోగించడం ● పొగరాని జనరేటర్ల వాడకం ● ఇంధన ఉపయోగం తగ్గించడం ● 15 ఏళ్లు దాటిన వాహనాల రాకపోకలు నిలిపివేయడం. ● ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ ● ఎప్పటికప్పుడు చెత్త, వ్యర్థాల తరలింపు, శుద్ధి చేసి సంపద సృష్టి.. తదితర విధానాలను పాటించడం.

ప్రజలదే బాధ్యత..: కాలుష్య కారకాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. వారే కీలక పాత్ర పోషించాలి. అవసరం మేరకు మోటారు వాహనాలను ఉపయోగించాలి. నగరంలో పరిస్థితిపై ఇప్పటికే పురపాలిక, పోలీసులు, రవాణా, రోడ్లు, వ్యవసాయశాఖలకు వీటిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇటీవల అవగాహన సమావేశం నిర్వహించాం. దశల వారీగా మిగిలిన శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున చర్యలు చేపడతాం. - సుదర్శన్‌, ప్రాంతీయాధికారి, కాలుష్య నియంత్రణ మండలి.

కాలుష్యం లెక్కించే యంత్రం​​​​​​​

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని