logo

నకిలీ నోట్ల చెలామణి

నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన సత్యనాగమల్లేశ్వరరెడ్డి, వనజ దంపతులకు ఈనెల 11న రాజమహేంద్రవరానికి చెందిన

Published : 24 May 2022 05:14 IST

 దంపతుల అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై ప్రయోగమూర్తి

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన సత్యనాగమల్లేశ్వరరెడ్డి, వనజ దంపతులకు ఈనెల 11న రాజమహేంద్రవరానికి చెందిన అనిల్‌రెడ్డి అనే వ్యక్తితో అనపర్తిలో జరిగిన ఓ వివాహ వేడుకలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆయన నకిలీ నోట్ల గురించి వీరికి వివరించి, రూ.10 వేలు తీసుకుని రూ.20 వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీరు బొబ్బిలిలోని దాడితల్లి పండగకు వెళ్లి కొన్ని నోట్లు మార్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు రాయగడలో తిరిగి వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లకు చెల్లని నోట్లిచ్చారు. మూడురోజుల క్రితం కొమరాడ మండలం కోటిపాంలోని ఓ దుకాణం వద్ద ఇలాగే కొనుగోలు చేస్తూ దుకాణదారుడికి దొరికిపోయారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం పార్వతీపురంలోని పాతబస్టాండు వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొన్ని దొంగనోట్లు, ద్విచక్ర వాహనం, సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అనిల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు బృందాలను పంపిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని