logo

బొబ్బిలిలో మార్పు మొదలైంది

బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Published : 20 Apr 2024 03:59 IST

తెదేపాలోకి భారీగా వలసలు
ఎమ్మెల్యే సొంత మండలం నుంచి వాలంటీర్లు, నాయకుల చేరికలు

ఎమ్మెల్యే స్వగ్రామం పక్కి నాయకులతో బేబినాయన

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు బొబ్బిలి, రామభద్రపురం మండలాలకు చెందిన పలువురు సైకిలెక్కారు. కూటమి అభ్యర్థి బేబినాయన వీరికి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.

బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన బంకురు బాబూరావు, నీటి సంఘ మాజీ ఉపాధ్యక్షుడు తెంటు అప్పలనాయుడు, సీర శంకరరావు, శంబంగి గురువుగారి అప్పలనాయుడు, రాయిపల్లి సత్యనారాయణ, పక్కి గ్రామ కమిటీ అధ్యక్షురాలు బంకురు లక్ష్మీనారాయణమ్మ, మూడో వార్డు మెంబరు బంకురు అప్పలనాయుడులతోపాటు పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. చింతాడ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు చింతాడ జ్యోతి, కర్రి తిరుపతిరావు, యామలాపల్లి సత్యనారాయణ, వాలంటీరు కర్రి అనిల్‌, అల్లు గీతారాణి, మాజీ ఉప సర్పంచి కర్రి సత్యనారాయణ, రెడ్డి వెంకటనాయుడు, తోడిబండి పోలినాయుడు, రాము, సిరికి రామకృష్ణ, అల్లు పోలినాయుడుతోపాటు 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఎస్‌.సీతారాంపురం గ్రామానికి చెందిన ముదిలి గిరిబాబు, పాలవలస సత్యనారాయణ, తుట్ట అప్పారావు, కర్రోతు అప్పలనాయుడు, కర్రోతు తిరుపతిరావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. పట్టణంలోని సాయినగర్‌ కాలనీ వినియోగదారుల సంఘ అధ్యక్షుడు ముప్పాల నరసింగరావు, రెడ్డి రవీంద్ర, పెంట జగన్నాథం, పెంట లక్ష్మణరావు, మడక శ్రీనివాసరావు, దుర్గాసి సత్యారావు, ఎం.సత్యనారాయణ, బొత్స సన్యాసమ్మ, గొండ సాయికుమార్‌, ఎస్‌.సింహాచలంతో పాటు 30 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఇటీవల గిరిజన గ్రామాల్లోనూ బేబినాయనకు బ్రహ్మరథం పట్టారు. మీకే తమ మద్దతని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు