Boult Soundbars: డీఎస్‌పీ టెక్నాలజీతో బౌల్ట్‌ సౌండ్‌బార్‌.. ధర, ఫీచర్లివే..!

Boult Soundbars: బౌల్ట్‌ హోమ్‌ ఆడియో డివైజ్‌ల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా సౌండ్‌బార్‌లను ప్రవేశపెట్టింది.

Published : 02 May 2024 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ బౌల్ట్‌ తమ తొలి సౌండ్‌బార్‌ను (Boult Soundbars) విడుదల చేసింది. తద్వారా హోమ్‌ ఆడియో డివైజ్‌ రంగంలోకి ఈ కంపెనీ ప్రవేశించింది. బాస్‌బాక్స్‌ ఎక్స్‌120, బాస్‌బాక్స్‌ ఎక్స్‌180.. రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. ‘డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ (DSP)’ టెక్నాలజీ, బ్లూటూత్‌ 5.3 వంటి కొన్ని అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

బౌల్ట్‌ బాస్‌బాక్స్‌ ఎక్స్‌120 (BassBox X120) రెండు సౌండ్‌ డ్రైవర్లతో వస్తోంది. 120RMS ఆడియో ఔట్‌పుట్‌ ఇస్తుంది. చిన్న గదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. వైర్డ్‌ సబ్‌వూఫర్‌ బాస్‌ ఔట్‌పుట్‌ కూడా ఉండడం విశేషం. ఆడియో సెట్‌ చేయడానికి మూవీ, మ్యూజిక్‌, న్యూస్‌ ఇలా మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఈ సౌండ్‌బార్‌ను నియంత్రించడానికి కంట్రోల్‌ ప్యానెల్‌తో పాటు రిమోట్‌ కూడా ఉంది. సౌండ్‌ క్వాలిటీని మెరుగుపర్చేందుకు డీఎస్‌పీ టెక్నాలజీని పొందుపర్చారు.

బాస్‌బాక్స్‌ ఎక్స్‌180 (BassBox X180) నాలుగు సౌండ్ డ్రైవర్స్‌తో వస్తోంది. పెద్ద గదులకు సరిపోయేలా దీన్ని రూపొందించారు. దీంట్లోనూ సబ్‌వూఫర్‌, మూడు రకాల ఆడియో సెట్టింగ్‌లు ఉన్నాయి. మిగిలిన ఫీచర్లన్నీ ఎక్స్‌120 తరహాలోనే ఉన్నాయి. 2.1 ఛానెల్‌ సెటప్‌తో వచ్చే ఈ రెండు సౌండ్‌బార్లు బ్లూటూత్‌ 5.3, ఏయూఎక్స్‌, యూఎస్‌బీ, ఆప్టికల్, హెచ్‌డీఎంఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ టీవీ, కంప్యూటర్లు, మొబైళ్లు, గేమింగ్స్‌ కన్సోళ్ల వంటి డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

బాస్‌బాక్స్‌ ఎక్స్‌120 ధర రూ.4,999. ఎక్స్‌180 ధర రూ.5,999. ఇవి ఫ్లిప్‌కార్ట్‌ సహా బౌల్ట్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని