logo

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కావాలి

పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 11 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Published : 04 May 2024 02:57 IST

ఉడాకాలనీ, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 11 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాగునీరు, విద్యుత్తు, ర్యాంపులు, మరుగుదొడ్లు, సూచిక బోర్డులు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. 12న ఎన్నికల సిబ్బంది చేరుకుంటారని చెప్పారు. ఓటర్లు ఎండకు ఇబ్బంది పడకుండా నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్‌ సిబ్బందికి మంచి ఆహారం, శీతల పానీయాలను ఆందించాలని కోరారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ కార్తీక్‌, డీఆర్వో అనిత, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని