logo

‘మనఊరు మనబడి’తో పాఠశాలల అభివృద్ధి

‘మనఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా శనివారం రూ.22,34,295తో కరీమాబాద్‌ ఉర్సులోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ శంకుస్థాపన చేశారు

Published : 22 May 2022 03:10 IST

కరీమాబాద్, న్యూస్‌టుడే: ‘మనఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా శనివారం రూ.22,34,295తో కరీమాబాద్‌ ఉర్సులోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మనఊరు మనబడి’తో పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్‌ గుండు చందన, పూర్ణచందర్, దిడ్డికుమారస్వామి, మాజీ కార్పొరేటర్‌ కేడల పద్మ, పాల్గొన్నారు. 


దేశాయిపేట : దేశాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో రూ.27 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్‌ శంకుస్థాపన చేశారు. డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమిమ్, కార్పొరేటర్‌ కవిత, డీఈవో వాసంతి, ఎంఈఓ విజయ్‌కుమార్, ఇనుముల నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో మనబడి మనబస్తి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీని పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రొటోకాల్‌ పాటించకుండా డీఈఓ, ఎంఈఓ తనను అవమానపరిచారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని సారయ్య తెలిపారు. 

రంగశాయిపేట : రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే నరేందర్‌ ఆవిష్కరించారు. 42వ డివిజన్‌ కార్పొరేటర్‌  చందన, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ జనార్దన్, డీఈవో వాసంతి పాల్గొన్నారు. 

ఖిలావరంగల్‌ : ఖిలావరంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెరాస జెండాను ఎమ్మెల్యే నరేందర్‌ ఆవిష్కరించారు. 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోగి సువర్ణ, యూత్‌ నాయకుడు అభిషేక్‌ ఆధ్వర్యంలో పడమరకోట ద్వారం నుంచి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్‌ కుమారస్వామి పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని