logo

జిల్లా అభివృద్ధిపై మంత్రికి చిత్తశుద్ధేదీ ?

జనగామకు ప్రభుత్వం మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ జిల్లా రాయపర్తికి మార్చేందుకు ప్రతిపాదించారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్‌ ఆరోపించారు

Published : 04 Oct 2022 03:38 IST

మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకుడు అభిగౌడ్‌

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: జనగామకు ప్రభుత్వం మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ జిల్లా రాయపర్తికి మార్చేందుకు ప్రతిపాదించారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్‌ ఆరోపించారు. జనగామలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా అభివృద్ధిపై మంత్రికి చిత్తశుద్ధి లేదని అవగతమవుతోందన్నారు. గురుకుల పాఠశాలను జిల్లాలోనే ప్రారంభించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని అన్నారు. సమావేశంలో నాయకులు వెంకన్న, యాకు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని