logo

టిఫా స్కానింగ్‌ యంత్రం ప్రారంభం

వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన టిఫా స్కానింగ్‌ యంత్రాన్ని శనివారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ప్రారంభించారు.

Published : 27 Nov 2022 05:21 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన టిఫా స్కానింగ్‌ యంత్రాన్ని శనివారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ప్రారంభించారు. ఇప్పటికే ఆసుపత్రిలో రెండు యంత్రాలుండగా, కొత్తగా వచ్చిన రెండింటితో ఆసుపత్రిలో మొత్తం నాలుగు అందుబాటులోకి రావడం వల్ల గర్భిణులకు ఉపయోగకరం కానుందని ఎమ్మెల్యే నరేందర్‌ అన్నారు. గర్భస్థదశలోనే శిశువులోల పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి చికిత్స ద్వారా సరిచేయడానికి అవకాశముంటుందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంటు డాక్టర్‌ పద్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్యాంకుమార్‌, కార్పొరేటర్‌ గందె కల్పన నవీన్‌, రేడియాలజిస్టులు రాంబాబు, వనజ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని