logo

అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన

అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో పోరాడిన అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు.

Published : 07 Dec 2022 05:25 IST

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో పోరాడిన అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆయన రచించిన రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత, బహుజనులకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన సచివాలయానికి ‘డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ అని నామకరణం చేసి ముఖ్యమంత్రి దళితులపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గుర్తించాలన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, ఆర్డీవో కె.కొమురయ్య, అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు కామ సంజీవరావు, సామాజిక గిరిజన అధ్యయన వేదిక వ్యవస్థాపకులు కిషన్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని