logo

Warangal: నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీసీపై దాడి

అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు యువకులు టికెట్‌ కలెక్టర్‌ ఎల్‌.కిరణ్‌కుమార్‌పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు.

Published : 14 Mar 2023 09:24 IST

టీసీ కిరణ్‌కుమార్‌

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు యువకులు టికెట్‌ కలెక్టర్‌ ఎల్‌.కిరణ్‌కుమార్‌పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. కిరణ్‌కుమార్‌ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు. 

వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్‌ టికెట్‌ లేకుండా ఎస్‌-1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్‌ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీపై దాడికి పాల్పడడంతో కిరణ్‌కుమార్‌ గాయపడ్డారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం టీసీ కిరణ్‌కుమార్‌ను మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరిపై  కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని