logo

అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం

కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్‌, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు.

Updated : 20 Apr 2024 06:22 IST

కె-హబ్‌ భవనం

విద్యానగర్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్‌, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. అధునాతన వసతులతో భవనాలు ఏర్పాటు చేశారు. గత నెల 10వ తేదీన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కేయూ అధికారులు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయించారు. తరవాత వాటి గురించి పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ప్రారంభించి 40 రోజులు గడిచినా ఇప్పటి వరకు వాటిలో ఎలాంటి పరిశోధనలు చేపట్టలేదు. దీంతో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద విశ్వవిద్యాలయంలో కె-హబ్‌ తదితర ల్యాబ్‌లతో పాటు స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ కూడా దీనిలోనే ఏర్పాటు చేయడంతో వివిధ విభాగాల పరిశోధనలు, ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిశోధనలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే దివంగత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు జీవితం, రచనలు, ఆర్థిక  సంస్కరణలపై పరిశోధనలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రం కూడా ప్రస్తుతానికి నిరుపయోగంగానే ఉంది. వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని, పరిశోధనలు ప్రారంభించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. 

పి.వి.నరసింహారావు విజ్ఞాన కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని