logo

గాలివాన బీభత్సం.. అపార నష్టం

ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Published : 23 Apr 2024 03:55 IST

మహబూబాబాద్‌ రూరల్‌, మానుకోట, న్యూస్‌టుడే: ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలి దుమారం, వడగండ్ల వానకు జిల్లాలోని బయ్యారం, గార్ల, కురవి, మరిపెడ చిన్నగూడూరు, మహబూబాబాద్‌ మండలాల్లో సుమారు 1873 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయా మండలాల్లోని మామిడి తోటలను సోమవారం ఉద్యానశాఖ అధికారులు ఎ.విష్ణు, వి.అనిత, టి.అరుణ్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులకు పలు సాంకేతిక సూచనలు చేశారు. అదేవిధంగా సుమారు 124 విద్యుత్తు స్తంభాలు నేలవాలి సుమారు రూ. 6.25 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్తు అధికారులు అప్రమత్తమై విరిగిన స్తంభాల స్థానే 26 కొత్తవి వేశారు. విద్యుత్తు తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో ఆదివారం రాత్రి కొన్ని గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచింది. సిబ్బందితో వెంటనే చెట్ల కొమ్మలను తొలగించి సరఫరా పునరుద్ధరించారు. అయితే జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ అధికారులు తెలిపారు. మహబూబాబాద్‌ పట్టణ శివారు బేతోలు గ్రామంలో గాలి దుమారానికి పూసపాటి స్వరూప అనే మహిళ ఇంటిపై రేకులు కొట్టుకుపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని