logo

అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్‌ తనిఖీ కేంద్రాలు

లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్‌ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి వి.శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 26 Apr 2024 04:26 IST

ములుగు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్‌ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి వి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో అనధికార మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి 209 కేసులు నమోదు చేసి 124 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2,055 లీటర్ల నాటు సారాయి, 237 లీటర్ల మద్యం, 277 లీటర్ల బీరు, 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, 82,975 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు. నిరంతరంగా నాటు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తామని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎక్సైజ్‌ శాఖ అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.1.04 కోట్ల మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. సమాచారం సేకరణలో భాగంగా 18004252523 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక నిఘా బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని