logo

యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం

యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 01 May 2024 06:02 IST

శిరీష (పాతచిత్రం), మృతదేహాన్ని వెలికితీస్తున్న సిబ్బంది

వేలేరు, న్యూస్‌టుడే: యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేలేరు మండలం పీచర శివారు గ్రామమైన వావిలకుంట తండాకు చెందిన బానోతు నారాయణ కూతురు శిరీష (20) ఎస్టీ వసతిగృహంలో ఉంటూ హనుమకొండలోని కేడీసీ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండేది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 24న ఇంటికి వచ్చిన ఆమె ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి సంబంధం చూస్తున్నారంటూ మనస్తాపం చెంది 25న ఇంటి వద్ద గడ్డి నివారణ మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు అదే రోజే అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు 28న సుమోటోగా కేసు నమోదు చేశారు. మంగళవారం మండల మెజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ కోమి సమక్షంలో ఫోరెన్సిక్‌ వైద్య నిపుణుడు ఖాజామొయినుద్దీన్‌ను గ్రామానికి రప్పించి, పోస్టుమార్టం నిర్వహించడం కోసం మృతదేహాన్ని వెలికి తీశారు. యువతి తల్లిదండ్రులు ముందుగా నిరాకరించినా ఏసీపీ తిరుమల్‌, సీఐ మహేందర్‌, ఎస్‌ఐ హరిత వారికి అవగాహన కల్పించి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వచ్చాక వాస్తవాలు వెల్లడిస్తామని తహసీల్దార్‌ కోమి, ఏసీపీ తిరుమల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని