logo

‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’

ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు.

Updated : 01 May 2024 06:35 IST

మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో నాయకులు

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. మంగళవారం ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా సాధన కోసం ఆ రోజుల్లో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ములుగు జిల్లా జీవోను జారీ చేసినప్పటికీ.. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాకు కావాల్సిన నిధులను కేటాయిందన్నారు. కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జిల్లాను తరలిస్తున్నారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, జిల్లాను తరలించే ఆలోచన చేయలేదన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు, నాయకులు తమ వైఖరిని మార్చుకొని అభివృద్ధిలో మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ములుగు మండలం బరిగలోనిపల్లికి చెందిన పలువురు భారాస, భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని