logo

అనారోగ్యంతో ఓటరు.. బాధ్యత మరవలేదు!

మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్‌, మహబూబాబాద్‌లో ఆదివారం నుంచి ‘ఇంటి నుంచి ఓటు’ కార్యక్రమం ప్రారంభమైంది. డోర్నకల్‌కు చెందిన ఓటరు వెంకటేశ్వరరావు రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు.

Updated : 06 May 2024 06:37 IST

మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్‌, మహబూబాబాద్‌లో ఆదివారం నుంచి ‘ఇంటి నుంచి ఓటు’ కార్యక్రమం ప్రారంభమైంది. డోర్నకల్‌కు చెందిన ఓటరు వెంకటేశ్వరరావు రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. అప్పటి నుంచి అతడి భార్య విజయ సపర్యలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటి నుంచి ఓటు వేసేందుకు వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఎన్నికల సిబ్బంది ఇంటికి రావడంతో ఆయన మంచం మీద పడుకునే భార్య విజయ సాయంతో ఓటు వేశారు.

న్యూస్‌టుడే, డోర్నకల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని