logo
Published : 29/11/2021 02:18 IST

పరీక్ష కేంద్రాల పరిశీలన

పెదతాడేపల్లి వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని

పరిశీలించి బయటకు వస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జడ్జీలు

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆదివారం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. మండలంలోని శశి, వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు విడతల్లో పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాలను ప్రత్యేక పరిశీలకుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ జిల్లా జడ్జి భీమారావుతో కలిసి పరిశీలించారు. గూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు, తణుకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రాధిక, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.బాబు ఆయా కేంద్రాలకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో 504 మందికి 325, శశి కళాశాలో 275కు 188 మంది పరీక్షలకు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని