logo
Published : 07 Dec 2021 04:37 IST

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత


ఆటలను ప్రారంభిస్తున్న అధికారులు

భీమడోలు, న్యూస్‌టుడే: గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తును పొందవచ్చని రాష్ట్ర శాప్‌ డైరెక్టర్‌ దేవానంద్‌ తెలిపారు. పోలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలను, అందులో ప్రవేశం నిమిత్తం విద్యార్థినులకు (క్రీడాకారులు) సామర్థ్యాల(బ్యాటరీ) పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారిణి పి.సుజాత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిది దేవానంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పెదవేగిలో బాలురకు, పోలసానిపల్లిలో బాలికల కోసం ప్రత్యేకంగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గురుకుల పాఠశాలల రాష్ట్ర క్రీడాధికారి కె.జయరాజు మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు నిపుణులతో ప్రత్యేక తర్ఫీదు ఇస్తామన్నారు. ఉపసర్పంచి జల్లా బాలు, ఎంపీటీసీ సభ్యురాలు ఎ.దేవి, ప్రిన్సిపల్‌ ఎం.పద్మజ, పీడీ కె.విజయలక్ష్మి, పీఈటీ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


సామర్థ్యాల పరీక్షలో పోటీ పడుతున్న విద్యార్థులు

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని