logo

హామీలన్నీ అమలు చేస్తున్నాం: మంత్రి

పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మొగల్తూరులో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నమూనా చెక్కును లబ్ధిదారులకు శుక్రవారం ఆమె అందజేశారు.

Published : 24 Sep 2022 05:59 IST

మహిళలకు నమూనా చెక్కు అందిస్తున్న వనిత, ప్రసాదరాజు

మొగల్తూరు, న్యూస్‌టుడే: పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మొగల్తూరులో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నమూనా చెక్కును లబ్ధిదారులకు శుక్రవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటికల నెరవేర్చేందుకు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించామన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేకపోయాయని ఆమె ప్రశ్నించారు. మహిళా సాధికారత సాధించేందుకు జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చారన్నారు. విద్య, వైద్యం తదితర అంశాలతో నూతన విధానాలను అమలు చేస్తున్నారన్నారు. సబ్‌కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌, జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యులు తిరుమాని బాపూజీ, సర్పంచి పడవల మేరీసత్యనారాయణ, మాజీ ఎంపీపీ అందె భుజంగరావు, వైస్‌ఎంపీపీ కైలా సుబ్బారావు, కుక్కల కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని