logo

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

విజయదశమి సందర్భంగా బుధవారం దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు.

Updated : 05 Oct 2022 15:31 IST

దెందులూరు : విజయదశమి సందర్భంగా బుధవారం దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. పోతనూరు, కొవ్వలి, దెందులూరు, సోమవరప్పాడు, గోపన్నపాలెం, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కనకదుర్గమ్మ విగ్రహాలను నూతన వస్త్రాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. కొవ్వలి మహాలక్ష్మి ఆలయం, దెందులూరు పెద్దింటమ్మ అమ్మవారి ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఉండ్రాజవరంలోని సోమాలమ్మ ఆలయం, సత్యనారాయణపురంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల్లో పూజల అనంతరం పలు చోట్ల హనుమాన్‌ చాలీసా పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని