logo

పుట్టగొడుగులు ఆరోగ్యకరం : వీసీ

ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకర ఆహారాల్లో పుట్టగొడుగులు ఒకటని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి .టి.జానకిరామ్‌ అన్నారు.

Published : 29 Jan 2023 05:19 IST

విద్యార్థులు తయారు చేసిన వంటకాలు  పరిశీలిస్తున్న వీసీ జానకిరామ్‌

ఉద్యాన విశ్వవిద్యాలయం(తాడేపల్లిగూడెం పట్టణం), న్యూస్‌టుడే: ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకర ఆహారాల్లో పుట్టగొడుగులు ఒకటని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి .టి.జానకిరామ్‌ అన్నారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా శనివారం ‘పుట్టగొడుగుల దినోత్సవం’ ఘనంగా నిర్వహించాయి.  వీసీ మాట్లాడుతూ  పుట్టగొడుగులతో తయారు చేసిన బిస్కెట్లు, కుకీలు, ప్రొటీన్‌ పౌడర్‌ తదితర ఉత్పత్తులకు వైఎస్‌ఆర్‌హెచ్‌యూ పేరుతో బ్రాండ్‌ రూపొందించాలని, క్లస్టర్‌ విశ్వవిద్యాలయాలైన ఏపీఎన్‌ఐటీ, జేఎన్‌టీయూ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో పుట్టగొడుగుల దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులు అనుభవ పూర్వక అభ్యసన(ఈఎల్‌పీ)లో భాగంగా పుట్ట గొడుగులతో 28 రకాలు వంటకాలు తయారు చేశారు.  విజేతలకు  బహుమతులు అందజేశారు. పుట్టగొడుగుల పెంపకం, విలువ ఆధారిత ఉత్పత్తులపై శాస్త్రవేత్తలు రమాదేవి, నరసింహారావు అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని