logo

సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి

అనాథలకు ఉచిత విద్య, వసతి, వైద్యంతో కూడిన సేవలందిస్తున్న ‘హీల్‌’ అనాథ బాలల స్వర్గసీమ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Published : 09 Jun 2023 05:43 IST

మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: అనాథలకు ఉచిత విద్య, వసతి, వైద్యంతో కూడిన సేవలందిస్తున్న ‘హీల్‌’ అనాథ బాలల స్వర్గసీమ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్‌ ప్యారడైజ్‌లో గురువారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను, పదోతరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడటం గర్వంగా భావించాలని, తెలుగు భాషా పరిరక్షణకు ప్రపంచంలోని తెలుగు వారందరూ పునరంకితం కావాలన్నారు. హీల్‌ ఛైర్మన్‌ పిన్నమనేని ధనప్రకాశ్‌ మాట్లాడుతూ.. అతి త్వరలో హీల్‌ను విశ్వవిద్యాలయం చేస్తామని, 2030 నాటికి లక్ష మంది అనాథ విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, హీల్‌ ఇండియా ఉపాధ్యక్షుడు జీడీవీ ప్రసాద్‌,  హీల్‌ కార్యదర్శి తాతినేని లక్ష్మీ, డైరెక్టర్లు టి.భాస్కర్‌, ఎం.రంగప్రసాద్‌, సీఈవో కె.అజయ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ బి.సాయిబాబు, డీఎస్పీ ఈ.అశోక్‌ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని