logo

నూతన రైళ్లతో తీర ప్రాంత అభివృద్ధి

నూతన రైళ్లను నడపడం ద్వారా తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. విజయవాడ - హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను శుక్రవారం నుంచి నరసాపురం వరకు పొడిగించారు.

Updated : 13 Jan 2024 06:36 IST

జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న ప్రసాదరాజు

నరసాపురం, న్యూస్‌టుడే: నూతన రైళ్లను నడపడం ద్వారా తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. విజయవాడ - హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను శుక్రవారం నుంచి నరసాపురం వరకు పొడిగించారు. నరసాపురంలో రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం  ప్రసాదరాజు మాట్లాడారు. రైల్వే శాఖ ఏడీఆర్‌ఎం వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ భీమవరం నుంచి చెన్నై, నరసాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నరసాపురం నుంచి విశాఖ పట్నానికి రైలు నడిపే పరిస్థితి లేదని, ఈ ప్రాంతవాసుల వినతులను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, పురపాలక ఛైర్‌పర్సన్‌ బర్రె శ్రీవెంకటరమణ, భాజపా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, రైల్వే ప్రయాణికుల సలహా మండలి సభ్యుడు జక్కంపూడి రమేష్‌కుమార్‌, విజయవాడ కమర్షియల్‌ మేనేజరు వి.రాంబాబు, నరసాపురం స్టేషన్‌ మేనేజరు చినిమిల్లి దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని