logo

కైకలూరు బరిలో కామినేని

తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Published : 28 Mar 2024 04:43 IST

తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా ఎంపిక

ఈనాడు, ఏలూరు, కైకలూరు, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో కైకలూరు మినహా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తాజాగా కైకలూరుపై స్పష్టత రావటంతో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టయ్యింది.

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రయాణం.. కైకలూరు మండలం వరాహపట్నానికి చెందిన కామినేని శ్రీనివాస్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన చురుకుతనం చూసిన ఎన్టీఆర్‌ 1983లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి తెదేపాలో పలు పదవుల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమతోనూ ఆయనకు అనుబంధం ఉంది. దీంతో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి 2009లో కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఉన్న సాన్నిహిత్యంతో భాజపాలో చేరి 2014లో కైకలూరు నుంచి భాజపా తరపున పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్‌పై 21,555 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్న కామినేని తిరిగి 2024లో తెదేపా, జనసేన, భాజపా పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు.


పుట్టిన తేదీ: 03.12.1947
కుటుంబ నేపథ్యం: తండ్రి విజయసింహ, తల్లి రాజేశ్వరమ్మ, భార్య మనోరమ, సంతానం: ముగ్గురు అబ్బాయిలు విదేశాల్లో స్థిరపడ్డారు. చదువు: ఎంబీబీఎస్‌  వృత్తి: ఆక్వా సాగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని