logo

చెరువులు మాయం

తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు  చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి.

Published : 29 Mar 2024 04:14 IST

ఆక్రమణకు గురైన పాతూరులోని మున్సిపల్‌ చెరువు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు  చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. పర్యవేక్షణ కొరవడి కొన్ని మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని ఆక్రమణల చెరలో కొట్టుమిట్టాడుతున్నాయి. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని పలు చెరువులు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల్లో ఉన్నవి క్షేత్రస్థాయిలో కానరాకపోవడం గమనార్హం.

కాగితాల్లోనే తటాకాలు.. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 100.26 ఎకరాల విస్తీర్ణంలో 23 చెరువులు ఉన్నాయి. అయితే పురపాలక సంఘం లెక్కలో మాత్రం 15   మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే చాలా వరకు లెక్కల్లో లేకుండా పోయాయి. కబ్జాకు గురైన వీటిని రక్షించేందుకు యంత్రాంగం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యం. ఇదే అదనుగా మరింత మంది మిగిలిన వాటిపై కన్నేశారు. గట్లను ఆక్రమించుకుని చిన్న తరహా నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానంగా యర్ర, పసర్ల, సిద్ది, అనంతమ్మ, బట్టువాని గుంట, కొత్తకర్ర  వంటి చెరువులు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. ‘పురపాలక చెరువులను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ సీతారాం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని