logo

ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19  దాఖలయ్యాయి.

Published : 24 Apr 2024 04:22 IST

భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19  దాఖలయ్యాయి. భాజపా తరఫున నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ నామినేషన్‌ పత్రాలను ఆర్వో, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు అందజేశారు. ఆయన వెంట భాజపా రాష్ట్ర పరిశీలకుడు అజిత్‌సింగ్‌, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. శ్రీనివాసవర్మ మద్దతుదారుడు, మరో అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇప్పటికే నామినేషన్‌ వేసిన వైకాపా ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అదనంగా రెండు సెట్లు, ఆమె భర్త జగదీష్‌కుమార్‌ ఒక సెట్టు పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భీమవరం నుంచి ఏడుగురు, ఉండి-5, ఆచంట- 1, తణుకు- 2, తాడేపల్లిగూడెం- 4 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని