logo

సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల

దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు

Published : 26 Apr 2024 03:57 IST

మాట్లాడుతున్న ప్రభాకర్‌

తణుకు, న్యూస్‌టుడే: దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు. ‘సంక్షోభంలో రాజ్యాంగం ఆర్థిక, రాజకీయ మూలాలు’ అంశంపై స్థానిక సజ్జాపురం లయన్స్‌ క్లబ్‌లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందన్నారు. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోందని పేర్కొన్నారు. బడా ధనవంతులపై సంపద పన్ను వేయాలన్నారు. పెరిగే ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయన్నారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో దారి దీపం పత్రిక ప్రధాన సంపాదకుడు డీవీవీఎస్‌ వర్మ, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.మురళీకుమార్‌, పలువురు మేధావులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని