logo

జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

Published : 30 Apr 2024 06:54 IST

ఓటర్లను గందరగోళం పరిచేలా కుట్ర

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఆ పార్టీ పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి అదే గుర్తును కేటాయించారు. సదరు గుర్తు కోసం ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడితే డ్రా విధానంలో గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఓటర్లను తికమక పెట్టాలనే ఉద్దేశంతో ఇతర రాజకీయ పార్టీల వారు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించేలా ఎత్తుగడ వేశారన్న విమర్శలున్నాయి. దీనిపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు.  ఏలూరులో జనసేన పార్టీ తరఫున ఎవరూ పోటీలో లేకపోవడంతో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా-ఏ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. కైకలూరు స్వతంత్య్ర అభ్యర్థి ముదినేపల్లి మండలానికి చెందిన మాదాసు సత్యనారాయణకు  గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.  చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన మువ్వల ఎస్తేర్‌ రాణికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడం చర్చనీయాంశమైంది. తణుకు, పాలకొల్లులోనూ ఇదే గుర్తు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని