logo

‘అసమర్థ సీఎం.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దాం’

వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ,

Published : 01 May 2024 04:58 IST

రోడ్‌షోలో మాట్లాడుతున్న శ్రీనివాసవర్మ, పితాని

పోడూరు, పెనుగొండ గ్రామీణ, పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అసెంబ్లీ ఆచంట అభ్యర్థి పితాని సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వారిద్దరూ కలిసి పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి చేపట్టిన రోడ్‌షో ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల మీదుగా సాగి పెనుమంట్ర మండలంలో ముగించారు. ఆయా కూడళ్లలో వారు మాట్లాడుతూ ఒక చేత్తో రూ.వంద ఇచ్చి మరో చేత్తో రూ.వెయ్యి దోచేస్తున్న జగన్‌ మాయమాటలకు మోసపోవద్దు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విద్యాసంస్థ విద్యాభవన్‌ ఛైర్మన్‌గా ఉండి ఫీజుల సొమ్ములు రూ.కోట్లు కొట్టేసిన శ్రీరంగనాథరాజుకు పిల్లల ఉసురు తగలదా అన్నారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ముసుగులో సర్వం బొక్కేశారన్నారు. పిల్లల సొమ్ముతో మార్టేరులో బస్టాండ్‌ కట్టించి సేవాకార్యక్రమాల చేస్తున్నానని నట సామ్రాట్‌ అహంకారి శ్రీరంగనాథœరాజుకు జూన్‌ 4 తర్వాత శంకరగిరి మాన్యాలే దిక్కన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు, భూ వివాదాలు, కుటుంబ వివాదాలు జోక్యం చేసిన శ్రీరంగరాజుకు రిటన్‌గిఫ్ట్‌ ఇవ్వాలని వివరించారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను, సైకిల్‌ గుర్తుకు ఓటేసి సత్యనారాయణను గెలిపించాలని శ్రీనివాస వర్మ కోరారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు రుద్రరాజు వెంకటరామరాజు, భాజపా రాజస్థాన్‌ రాష్ట్ర కార్యదర్శి ఉదయపూర్‌, శాసనసభ్యుడు కులదీప్‌, భాజపా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పాక వెంకట సత్యనారాయణ, భాజపా పరిశీలకుడు శ్రీనివాస్‌ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని