logo

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు

Published : 02 May 2024 04:15 IST

 దుంపగడప: ప్రచార వాహనంపై రఘురామకృష్ణరాజు, శ్రీనివాసవర్మ
ఆకివీడు, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆకివీడు మండలం దుంపగడప, మందపాడు, చెరుకుమిల్లి, అయిభీమవరం, కుప్పనపూడి, తాళ్లకోడు, అజ్జమూరు గ్రామాల పరిధిలో వారు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల నాయకత్వం అవసరమన్నారు. రఘురామకృష్ణరాజుకు తన స్వగ్రామమైన అయిభీమవరంలో గ్రామస్థులు, బంధుమిత్రులు అపూర్వ స్వాగతం పలికారు. ఆయన తన చిన్నాన్న, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తితిదే మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజును కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రచారంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం), జుత్తిగ నాగరాజు పాల్గొన్నారు.

ఉండి, న్యూస్‌టుడే: కనుమూరి రఘురామకృష్ణరాజు కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, పలువురు నాయకులు బుధవారం సాయంత్రం కలిగొట్ల, ఆరేడు, పాందువ్వ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.  సర్పంచులు సాగిరాజు యామినీ ప్రియాంక, మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీˆటీసీˆ సభ్యుడు రుద్రరాజు యువరాజు, జనసేన మండల అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వరరావు, ఐతెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యశోద కృష్ణయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు