logo

కాలువ కన్నీరు పెడుతోంది

పదిహేను వేల ఎకరాలకు నీరందించాల్సిన ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఇది. సుమారు 20 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది.

Published : 07 May 2024 05:54 IST

కర్షకుల అవస్థలు పట్టని జగన్‌ ప్రభుత్వం

 కనీస నిర్వహణకు నోచని వైనం

పదిహేను వేల ఎకరాలకు నీరందించాల్సిన ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఇది. సుమారు 20 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. ఫలితంగా నీరు ముందుకు పారడంలేదు. రైతులే స్వచ్ఛందంగా తూడు తొలగించుకుంటున్నా...చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి.

పోలవరం ఇసుక కాలువ కుడిగట్టుకు ఇటీవల గండి పడిన దృశ్యమిది. ఈ గట్టుకు  ఏటా గండ్లు పడుతుండటంతో సుమారు 400 ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటిని పూడ్చడానికి మండల పరిషత్తు నిధులు రూ.3 లక్షలు ఖర్చు చేసినా, ఫలితం మాత్రం లేదు.

తిరుమలాపురం వద్ద బయనేరుపై నిర్మించిన ఆక్విడక్టు 2018లో సంభవించిన వరదలకు కూలిపోయిన దృశ్యమిది. ఈ కారణంగా ఎడమ ప్రధాన కాలువ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీటి సరఫరా ఆగిపోయింది. నిధులున్నా పనులు చేసేందుకు గుత్తేదారు ముందుకురాలేదు.
న్యూస్‌టుడే-జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం గ్రామీణ: జగన్‌ జమానాలో మెట్ట, ఏజెన్సీ మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కాలువలు పంట చేలకు సాగునీరందించే పరిస్థితుల్లో లేవు. కాలువలపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ కొరవడటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. లైనింగ్‌లు లేకపోవడం, క్రాస్‌ రెగ్యులేటర్లు దెబ్బతినడం, తూములు పాడవడం, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో సాగునీరు ముందుకుపారడం లేదు. దీనికితోడు గండ్లు, లీకేజీలు, అడ్డుకట్టలు, కుంగిన గట్లు నీటి ప్రవాహానికి అవరోధాలుగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు