logo

పోలింగ్‌ కేంద్రానికి పచ్చ రంగు

కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్‌ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు.

Published : 09 May 2024 03:32 IST

వ్యతిరేకించిన స్థానికులు
ఎట్టకేలకు తెల్ల రంగు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్‌ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు. అది వైకాపా జెండాలోని రంగుతో పోలినదిగా ఉందని స్థానికులు వ్యతిరేకించారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ముక్కంటికి ఫిర్యాదు చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకటకృష్ణ అక్కడికొచ్చారు. స్థానికులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన నాలుగు పోలింగ్‌ కేంద్రాలను నమూనా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మహిళలు, యువత, దివ్యాంగులు, సాధారణ కేటగిరీల వారి కోసం వీటిని ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. ‘గో గ్రీన్‌- లవ్‌ గ్రీన్‌’ అనే నినాదంతో ఓటర్లకు పచ్చని మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. స్థానికులు స్పందిస్తూ వైకాపాకు సంకేతంగా ఉన్న రంగును తొలగించాలని పట్టుబట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆకుపచ్చ రంగు  తొలగించి తెల్ల రంగు వేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని