logo

బీమాలోనూ జగన్మాయ

యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్‌ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది.

Updated : 09 May 2024 05:30 IST

లబ్ధిదారుల కుదింపుతో పేదలకు నష్టం

నాలుగేళ్ల క్రితం వీరవాసరం గ్రామానికి చెందిన దేవర దుర్గ భర్త కొండ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటికి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆమెకు ఎలాంటి పరిహారం రాలేదు. బీమా మిత్రలు పలుమార్లు ఆమె నుంచి ధ్రువపత్రాలు తీసుకుని ఉన్నతాధికారులకు పంపినా ప్రయోజనం లేకపోయింది.

భీమవరం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్‌ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో అప్పట్లో వివిధ కారణాలతో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు పరిహారం అందకుండా పోయింది. తరువాత వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినా కుటుంబంలో ఒక్కరికే బీమా రక్షణ కల్పించడం శాపంగా మారింది. వైకాపా సర్కారు నిర్ణయంతో వేల కుటుంబాలు నష్టపోయాయి. గతంలో వేలల్లో ఉన్న దరఖాస్తులు వందలకు పరిమితమయ్యాయి.

మార్పులు ఇలా..

గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం అమలైంది. 50 ఏళ్లలోపు వయసున్న వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.2 లక్షలు, 50 నుంచి 59 ఏళ్ల వయసున్న వారైతే రూ. 30 వేల చొప్పున పరిహారం అందించేవారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా ఈ పరిహారం దక్కేది. ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు అందించేవారు. వైకాపా సర్కారు మార్పులు చేసి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే బీమా వర్తింప చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. గత మూడేళ్లలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో మొత్తం 799 మందికి మాత్రమే బీమా పరిహారం అందింది. 2019- 20 సంవత్సరాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలు ఇంకా పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. అప్పట్లో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం చంద్రన్న బీమా పథకంలో మార్పుల పేరిట మూడు నుంచి నాలుగు నెలలపాటు బీమా ప్రీమియం చెల్లింపులను నిలిపివేయడంతో వందలాది పేద కుటుంబాలకు పరిహారం దక్కలేదు.

నాలుగేళ్లయినా పరిహారంరాలేదు..

2020 నవంబరులో నా కుమారుడు షేక్‌ అహ్మద్‌ ద్విచక్ర వాహనం ప్రమాదంలో మృతి చెందారు. అప్పట్లో బీమా క్లయిము అయినట్లు బీమా మిత్ర చెప్పడంతో నా కుమారుడి రేషన్‌కార్డు, ఆధార్‌, ఇతర పత్రాలు అందజేశాం. తరువాత ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఒక్క పైసా రాలేదు.

షేక్‌ బేగం, వీరవాసరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని