logo

చివరి అస్త్రాలకు పదును

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.

Published : 10 May 2024 04:09 IST

ముమ్మరంగా ప్రచారాలు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, పట్టణం, న్యూస్‌టుడే: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. భానుడు కూడా కొద్దిగా శాంతించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోపక్క వివిధ వర్గాలతో సంబంధిత ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్వ వైభవం సాధించేందుకు తెదేపా యత్నిస్తుండగా, పోటీలో ఉన్న స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జనసేన నాయకులు ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో సత్తాచాటిన వైకాపా ఈ సారి కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలనే యోచనతో సర్వశక్తులు ఒడ్డుతోంది.

కూటమిలో జోష్‌.. తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రచారం చేశారు. సినీనటులు సైతం రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు. ఉండిలో తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం ఉండి ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. మరోపక్క భాజపా ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 11న జిల్లాలో పర్యటించనున్నారన్న సమాచారంతో కూటమి శ్రేణుల్లో మరింత జోష్‌ వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ జిల్లాలో రెండు సార్లు పర్యటించినా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అధికార పార్టీ నాయకులు నిరాశలో ఉన్నారు.

ఓటు చీటీలు పంచుతూనే.. ఓటరు చీటీలను బీఎల్వోల ద్వారా అధికారికంగా ఇంటింటి పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైకాపా మద్దతుదారులు కూడా గ్రామాలు, పట్టణాల్లో ఈ చీటీలతో పాటు నగదు పంపిణీని మొదలుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని