logo

ప్రతి దరఖాస్తును పరిశీలించాలి : జేసీ

స్పందన’ కార్యక్రమంలో ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘స్పందన’ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ అనేకమంది సమస్యల

Published : 07 Dec 2021 04:37 IST


వినతులు సమర్పించేందుకు వరుసలో వస్తున్న ప్రజలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘స్పందన’ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ అనేకమంది సమస్యల పరిష్కారానికి ఇక్కడకు వస్తారని, వారి సమస్యలను సావధానంగా వినడంతోపాటు పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. 327 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ 113, పింఛన్లు 34, పంచాయతీరాజ్‌ శాఖ 37, పోలీసుశాఖ 24 చొప్పున రాగా.. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి.

సమస్యల పరిష్కారానికి కృషి : అదనపు ఎస్పీ

ఏలూరు టూటౌన్‌ : బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ సుబ్బరాజు అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తన ఇంటి దస్త్రాలు కొంతమంది బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని భీమవరానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరు రూ. 2.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని కొవ్వూరు నుంచి వచ్చిన మహిళ వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని