logo

ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు

బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు.

Published : 28 Mar 2024 03:50 IST

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు   దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. స్థానిక జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలంలో ఈనెల 15న గుడిసెలు వేసుకుంటే వాటి ఎదురుగా ఉన్న ఓ విద్యా సంస్థల అధినేత అధికారపార్టీ ప్రతినిధిగా పేర్కొంటూ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు, పోలీసులతో వచ్చి అర్ధరాత్రి సమయంలో గుడిసెలు, సామగ్రి ధ్వంసం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యా సంస్థల యజమానికి బద్వేల్‌ పట్ణణంలోని మడకవారిపల్లె గ్రామ పొలంలో నకిలీ పట్టాలు సృష్టించుకుని ప్యాలెస్‌ మాదిరిగా ఇళ్లు, గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారని ఆరోపించారు. స్కూల్‌ ఆవరణలో 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచె ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఆయన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గుడిసెలు తొలగించిన అధికారులపై హెచ్‌ఆర్సీ, లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చర్యలు తీసుకోకుంటే సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.  నాయకులు నాగసుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, వీరశేఖర్‌, బాదుల్లా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని