logo

ముగిసిన నామినేషన్ల పరిశీలన

జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు.

Published : 27 Apr 2024 05:58 IST

చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే: జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. సరిగా లేని 18 తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే... కడపలో 39 నామినేషన్లు రాగా 14 ఆమోదించారు. 25 తిరస్కరించారు. బద్వేలులో 28 మంది అభ్యర్థులకుగానూ 18 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపి 10 మందివి తిరస్కరించారు. మైదుకూరులో 28 మంది దరఖాస్తు చేయగా, 23 ఆమోదం పొందగా, 5 తిరస్కరణకు గురయ్యాయి. జమ్మలమడుగులో 33 నామినేషన్లు రాగా, 24 సరిగా ఉన్నాయని నిర్ధారించారు. 9 మందివి తిరస్కరించారు. పులివెందులలో 33 మంది అభ్యర్థులకుగానూ 30 ఆమోదించగా, మూడు తిరస్కరించారు. కమలాపురంలో 24 మంది నామినేషన్లు వేయగా, 13 ఆమోదం పొందగా, 11 తిరస్కరణకు గురయ్యాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 34 మంది అభ్యర్థులు ఉండగా 21 మందిని అర్హులుగా పరిగణించగా, 13 నామినేషన్లు తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని