logo

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ

రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు.

Published : 30 Apr 2024 06:38 IST

అభ్యర్థుల నామపత్రాలు పరిశీలిస్తున్న రాయచోటి ఆర్డీవో రంగస్వామి

రాయచోటి, న్యూస్‌టుడే: రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. రాజంపేట అసెంబ్లీకి 14 నామినేషన్లు దాఖలు కాగా, 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకోగా, మిగిలిన 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులకుగానూ ఒకరు నామినేషన్‌ను ఉపసంహరించుకోగా 11 మంది అభ్యర్థులు మిగిలారు. పీలేరు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవరూ కూడా ఉపసంహరించుకోలేదు. మదనపల్లె నియోజక వర్గంలో 15 మంది అభ్యర్థులుండగా, ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. స్వతంత్య్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని