logo

ట్రయల్‌రన్‌ పేరుతో పట్టణం దిగ్బంధం

ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

Published : 30 Apr 2024 06:43 IST

వాహనాలు రాకపోవడంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు

మైదుకూరు,  న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ప్రొద్దుటూరురోడ్డులోని కోర్టు సమీపంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయగా అక్కడి నుంచి సీఎం జగన్‌ ప్రొద్దుటూరురోడ్డు చేరుకుని బస్సుపై నుంచి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనతో ట్రయల్‌రన్‌కు సిద్ధపడిన పోలీసు అధికారులు సిబ్బందిని నిర్దేశించిన ప్రాంతాల్లో నిలిపారు. మేడలపైనా నిలబెట్టారు. పరిసరాలను గమనిస్తూ వచ్చారు. సీఎం ప్రసంగించేందుకు బస్సు నిలిపే ప్రాంతంలో పోలీసులు తాడును పట్టుకుని పోలీసులు నిలబడ్డారు. ఈ ట్రయల్‌రన్‌ అంతా దాదాపు గంటన్నరసేపు సాగింది. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రయల్‌ రన్నే కదా త్వరగా వదిలేస్తారని చూసినా ప్రయోజనం లేకపోయింది. గంటసేపు వేచి చూసిన ప్రయాణికులు ఊరుబయటకు నడుచుకుంటూ వెళ్లారు. ట్రయల్‌రన్‌తోనే ఇబ్బందులకు గురి చేస్తే సీఎం పర్యటించే మంగళవారం పోలీసులు ఎన్ని ఆంక్షలు పెడతాననే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేశారు.

వాహనాల దారి మళ్లింపు : సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా దారి మళ్లిస్తున్నారు. పోరుమామిళ్ల వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రొద్దుటూరు, కడప వైపునకు వెళ్లాలంటే వనిపెంట, ఉత్సలవరం మీదుగా పట్టణంలోని తిరుమల లాడ్జీవద్ద జాతీయ రహదారికి చేరుకునేలా నిర్ణయం తీసుకన్నారు. బద్వేలు వైపునకు వెళ్లే వాహనాలు కేశలింగాయపల్లె పుల్లయ్యస్వామి సత్రం మీదుగా మళ్లించనున్నారు. ప్రొద్దుటూరు నుంచి బద్వేలు వైపునకు వెళ్లే వాహనాలను పట్టణంలోని బైపాస్‌ నుంచి ఖాజీపేట మీదుగా మళ్లించనున్నారు. ముఖ్యమంత్రి బహిరంగసభకు వచ్చే వాహనాలను ఏరోడ్డుకు ఆరోడ్డులో పట్టణానికి దూరంగా నిలిపివేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని