logo

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు.

Published : 01 May 2024 01:35 IST

పీలేరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తున్న పరిశీలకులు

పీలేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు రవీంద్రకుమార్‌ (ఐఆర్‌ఎస్‌), పోలీస్‌ పరిశీలకులు నవాజ్‌ అహమ్మద్‌ తనిఖీ చేశారు. పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణాల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 224, 266, 267, 263, 268, 269లను ప్రత్యేకంగా తనిఖీ చేసి స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. వారి వెంట సహాయ రిటర్నింగ్‌ అధికారి మహబూబ్‌బాషా, సీఐ మోహన్‌రెడ్డి, ఎన్నికల ఉప తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం ఉన్నారు.

ములకలచెరువు గ్రామీణ : ఎన్నికల నియమావళి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదేనని అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలు కవిత మన్నికెరి సూచించారు. మంగళవారం తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు వైభవ్‌ శుక్లతో కలిసి తంబళ్లపల్లె ఎన్నికల్లో పోట© చేస్తున్న అభ్యర్థులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవగాహన సమావేశం నిర్వహించారు. నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ నాయకులు చిత్రాలు లేకుండా చూడాలని స్వతంత్రులకు సంబంధించిన గుర్తులు కూడా ఉండకూడదన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన ప్రతి అధికారిపై పూర్తి బాధ్యత ఉంటుందని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అభ్యర్థులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్వో రాఘవేంద్ర, ఏఆర్వో బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని