logo

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

రైతులు కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేందుకు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమీపంలోని

Published : 08 Dec 2021 05:58 IST


కరపత్రాలు ఆవిష్కరిస్తున్న గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రైతులు కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేందుకు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమీపంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సాధారణ రకం(కామన్‌) క్వింటాలుకు రూ.1,940లు, 75 కేజీలకు రూ.1,455, గ్రేడ్‌ ఏ రకం క్వింటాలుకు రూ.1,960లు, 75 కేజీలకు రూ.1,470 కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు బయట మార్కెట్‌లో అధిక ధర లభిస్తే విక్రయించుకోవచ్చని, ఆ వివరాలను కూడా ఆర్బీకేలో తెలియజేయాలన్నారు. తద్వారా జిల్లాలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందనే గణాంకాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గుంటూరు, మంగళగిరి, ప్రత్తిపాడు, సత్తెనపల్లి డివిజన్‌లలో కలిపి మొత్తం 125 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈక్రాప్‌ బుకింగ్‌లో నమోదు ద్వారానే ధాన్యం కొనుగోలు చేపట్టనున్నామని వివరించారు. ధాన్యం అమ్ముకునే రైతులు బుధవారం నుంచి ఆర్బీకేల్లో వారి వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో ఏడీఏలు కె.వి.శ్రీనివాసరావు, అమలకుమారి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని