logo

వెయ్యి బియ్యం బస్తాలు స్వాధీనం

కానూరులో భారీ ఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలను రెవెన్యూ, పెనమలూరు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇవి దాదాపు వెయ్యి బస్తాలుండగా.. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.8 లక్షల వరకూ ఉంటుందని

Published : 23 Jan 2022 03:26 IST

నిందితుడితో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు

పెనమలూరు, న్యూస్‌టుడే: కానూరులో భారీ ఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలను రెవెన్యూ, పెనమలూరు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇవి దాదాపు వెయ్యి బస్తాలుండగా.. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.8 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కాపా శివనాగప్రసాద్‌ ఏలూరు సమీపంలోని పెదపాడు నివాసి. అతను కొంతకాలం నుంచి నగరంలోని గుణదల, అజిత్‌సింగ్‌నగర్‌, నున్న తదితర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి చేపలు, రొయ్యల సాగు చేసే రైతులకు అధిక ధరలకు విక్రయిస్తుంటాడు. ఇటీవల ఏకంగా కానూరులో ఓ భారీ గౌడౌన్‌ను అద్దెకు తీసుకొని సేకరించిన రేషన్‌ బియ్యం బస్తాలను నిల్వ చేసి అక్రమంగా విక్రయిస్తుంటాడు. ఈ వ్యవహారం శనివారం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ, సిబ్బంది పోలీసులతో కలిసి దాడి చేయగా ఏకంగా వెయ్యి బస్తాలను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు రవాణా చేయడానికి వినియోగిస్తున్న రెండు లారీలు, ఒక కారును వీరు స్వాధీనం చేసుకున్నారు. శివనాగప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెనుక రేషన్‌ డీలర్ల ప్రమేయం ఉందా? లేదా? అన్న దానిపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని