logo

Andhra News: తన స్థలం ఇప్పించమని.. ఐదేళ్లుగా అధికారుల చుట్టూ..!

గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు

Updated : 17 May 2022 08:47 IST

ఈనాడు, అమరావతి: గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం పత్రాలను అధికారులకు ఇచ్చారు. సర్వే చేయించి ఆక్రమణకు గురైన తన స్థలం గుర్తించి తనకు ఇప్పించాలని 2018, 2021లో చలానా కూడా కట్టారు.అయినా అధికారులు వచ్చి సక్రమంగా కొలతలు వేసి.. ఆక్రమిత స్థలాన్ని తనకు ఇప్పించలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల నుంచి భార్యా పిల్లలతో కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చేనేత వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని..తనకు న్యాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్లోని అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని