Published : 27 Nov 2021 02:14 IST
అష్టలక్ష్మికి సీఎం కుటుంబ సభ్యుల పూజలు
ఆర్కేపురం, న్యూస్‌టుడే: ఆర్కేపురం డివిజన్లోని వాసవీ కాలనీలో ఉన్న అష్టలక్ష్మి ఆలయంలో కార్తిక శుక్రవారం సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సబితారెడ్డితో కలిసి కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీధర్, ఆలయ ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ చంద్రశేఖర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Tags :